నవంబర్ 7
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమలు అవినీతి లేకుండా గడప గడపన అందిస్తున్న సీఎం కేసీఆర్ కి మనం అందరం రుణపడి ఉండాలని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా బ్రహ్మాండంగా ఉందని ప్రజలు అడుగడుగున స్వాగతం పలుకుతున్నారని అన్నారు. గజ్వేల్ ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీలో ప్రతిపక్షాలకు చోటు లేదని అన్నారు. కెసిఆర్ సారథ్యంలో ప్రతి ఇంటికి గోదావరి జలాలతో తాగునీరు సాగునీరు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు దక్కిందని అన్నారు. భారతదేశంలోని బిజెపి పాలిత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్రణాళికాలతో దూరదృష్టతో అనేక రకాల సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలోనే నంబర్ వన్ గా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్, స్థానిక కౌన్సిలర్లు, బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు , కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
