ప్రాంతీయం

దూకుడు పెంచి తగ్గేదేలే అంటున్న హస్తం…

224 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్18, (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి తగ్గేదేలే అంటున్న హస్తం. శనివారం ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో 6, గ్యారంటీలను ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల్లోకి వివరిస్తూ ఓటర్లను పెంచుతూ చేతు గుర్తుకు ఓటువేసి కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వస్తే  అనేక పథకాల పేరుతో తెలంగాణ ప్రజలు మోసంచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్నిరకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా బి.ఆర్.ఎస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని తెలుపుతూ రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. మీపాలనపై విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ అభివృద్ధి శూన్యమని కమిషన్లు దండుకోవడం తప్ప మరొకటి చేయలేదని అన్నారు. సీసీ రోడ్లనువేసి ఇంటికో నల్ల కనెక్షన్ అంటూ రోడ్లను పగలగొట్టుడే తప్ప నీళ్లు రాలేవన్నారు. నాడు ఇచ్చిన మాటలుతప్పి దళితునికి మూడెకరాల భూమిలేదు, దళిత సీఎం కాలేడు, దళితబంధు లేదు, ఇంటికో ఉద్యోగంలేదు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, కొండం రాజిరెడ్డి, సీనియర్ నాయకులు రాజేశం, భానుచందర్, భాను, పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *