సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 547 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కనీస వసతులు ఉండేలా చూడాలని, ఓటరు సమాచార స్లిప్ లను నిర్దేశిత గడువు లోగా పంపిణీ చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లతో పోలింగ్ కేంద్రాల్లో వసతులు, ఓటరు సమాచార స్లిప్ ల పంపిణీ, హోమ్ ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, ఎస్ డీ సీ గంగయ్య, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
