ప్రాంతీయం

మంత్రి కేటీఆర్ కు రాజీనామా పత్రం సమర్పించి కాంగ్రెస్ గూటికి…

541 Views

ముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఒక సీనియర్ నాయకునిగా క్రమశిక్షణాయుత కార్యకర్తగా పనిచేస్తూ తమరి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రైతుబందు సమితి ఏర్పాటు చేసి నాకు జిల్లా రైతుబంధు అధ్యక్షునిగా రైతులకు సేవ సేవలందించే భాగ్యం కల్పించినందుకు కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇట్టి రైతుబంధు అధ్యక్షులు సంతీల జిల్లా అధ్యక్షులకు గౌరవ వేతనం చేస్తానన్నారు. కానీ ఆరు సంవత్సరాల నుండి నేటి వరకు నోచుకోలేదు బయట జనాలుగాని పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతుబంధు సమితిలకు వేదనాలు వస్తున్నట్లు భావించుకుంటున్నారు. వాడుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నోమార్లు కేటీఆర్ కు విన్నవించిన కానీ ఫలితం శూన్యం. నేను నాతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పూర్తి సమయాన్ని వెచ్చించి అంకితభావంతో పనిచేసినాము ఆయా జిల్లాల అధ్యక్షులు మేము సిరిసిల్ల వాసిగా మంత్రి కేటీఆర్ తో కలసి సాధకబాధక విషయాలు విన్నవించుదామనుకొనగా మంత్రి కేటీఆర్ ఇంకా సమయం తీసుకోవాలని కోరగా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య కేటీఆర్ ను కలుస్తామంటున్నారు. ఒకసారి సమయము ఇవ్వమని ప్రాదేయపడిన మాపై చొరవ చూపలేదు. ఇప్పటివరకు కనీసం కార్యాలయాన్ని నోచుకోలేదు ఇంకా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా పూర్తి సమయాన్ని వెచ్చించి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించే సదవకాశాన్ని నాకు కలిపించినందుకు కేటీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు, నాకు ఇంతకాలం సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, సభ్యులకు ప్రజాప్రతినిధులకు ఏ విధమైన చేయూత లభించక ఏవిధమైన నిధులు లేక రైతుబంధు అధ్యక్షుడిగా పార్టీ సభ్యునిగా విరమించుకుని కేటీఆర్ కు రాజీనామా లేక పంపుతున్నాను. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గూటిలో గడ్డం నర్సయ్య కలిసారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *