ముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి) గూడూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కల్వకుంట్ల తారకరామారావుని లక్ష మెజారిటీతో గెలిపించాలని మెనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పుల్లూరి సంతోష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ యూత్ నాయకులు, మహేష్, వెంకటేష్, మనీష్, ప్రశాంత్, శ్రీనివాస్, బాబు, మహేష్, సతీష్, నితిన్, గణేష్ ప్రచారంలో పాల్గొన్నారు.
