ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
దౌల్తాబాద్: ఈనెల 30న జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బైండోవర్ లు, సీజ్ చేసిన డబ్బులు, నాన్ బెలబుల్ వారెంట్, ఎగ్జిక్యూటివ్, ప్రైవేట్ గన్ డిపాజిట్, ఫ్లాగ్ మార్చ్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విపిఓ లు గ్రామాలను సందర్శించి ఎలక్షన్ కు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. గత ఎన్నికల్లో గొడవలు జరిగిన గ్రామాలలో ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారి పైన చెడు నడత గల వారిని విడతలవారీగా బైండోవర్ చేయాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని, పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే రిపేర్ చేయించాలన్నారు.గ్రామాలలో గ్రామస్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా సమాచారం వచ్చే విధంగా ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తోగుట సిఐ కమలాకర్, ఎస్సై చైతన్య రెడ్డి పాల్గొన్నారు…




