Breaking News ప్రాంతీయం

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

155 Views

కూతురే కొడకాయ్ తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు.

రెండు సంవత్సరాల క్రితం కిడ్నీలు పాడవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిన్ చేయించుకునేవాడు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.భూమా నందన్ కు ఇద్దరు కూతుళ్లే కావటంతో పెద్ద కూతురు వైష్ణవి తండ్రికి తన కొరవి పెట్టాల్సి వచ్చింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవటంతో ఇద్దరు కూతుళ్లు భార్య లత గుండెల పగిలేలా రోదించారు.

పెద్ద కూతురే కొడుకులా మారి తండ్రి చితికి నిప్పు పెట్టడం అంత్యక్రియలకు హాజరైన వారి హృదయాలను కలచివేసింది మృతునికి భార్యవి లత,కూతుళ్ళు వైష్ణవి (డిగ్రీ ప్రథమ సంవత్సరం) కీర్తన( ఆరవ తరగతి) ఉన్నారు .వీరిది పేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని కోరారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *