దేవరుప్పుల అక్టోబర్ 6 :దేవరుప్పుల మండలం పెద్ద మడూరు కాంగ్రెస్ నుండి బిఅర్ఎస్ లో కి భారీ చేరికలు.
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి.
పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు పలువురు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బిఅర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరినవారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, సీఎం కెసిఆర్ మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలి అని మంత్రి ఎర్రబెల్లి వారితో అన్నారు.
పార్టీలో చేరిన వారిలో పాలకుర్తి నియోజక వర్గం దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆ గ్రామ వార్డు సభ్యులు మునుగొండ యాదమ్మ, మునుగొండ మల్లయ్య, మునుగొండ గణేష్, మునిగొండ శ్రీనివాస్, గోకారపు యాకన్న, మునిగె జలంధర్, తిక్కుర్తి రాజు, ఇక్కుర్తి రాజు, పెరికే కోటేష్, మునిగొండ అశోక్, మునిగొండ మల్లయ్య, మునిగొండ అబ్బయ్య, బత్తిని గణేష్, గోకారపు భరత్, గోకారపు కళమ్మ, మునిగొండ శారద, మునిగె కళ్యాణి, బత్తిని ప్రమీల, మునిగొండ యాకమ్మ, పెరిక లలిత, జోగు యాదమ్మ తదితరులు ఉన్నారు.