లింగాపూర్ నవంబర్ 15:గిరి గుడాలకు, తండాలకు బిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష- ఆత్రం అనిల్ కుమార్.
లింగాపూర్ మండలంలోని కంచన్ పల్లి గ్రామపంచాయతీలోని ములగూడ గ్రామంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి ప్రచార కార్యక్రమం.
ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు ఆత్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్యారాచుట్ నాయకులు వస్తుంటారు, పోతుంటారు కేవలం డబ్బులు దండుకోవడానికి. కానీ లోకల్ నాయకులు మన కష్ట, సుఖాల్లో పాలుపంచుకొని మనకు అండగా నిలబడుతారు. అందుకే ప్రజలు ఆలోచన చేయాలి. బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి అందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.లింగాపూర్ మండలం మరింత అభివృద్ధి చెండాలంటే కారు గుర్తుకు ఓటు వేసి, కోవ లక్ష్మి ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనక జ్యోతిరామ్,ఎంపీపీ ఆడే సవిత ప్రేమ్, జడ్పీటీసీ ఆడే రక్క బాయి లక్య, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మరామ్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ సలీమ్,మండల సోషల్ మీడియా కన్వినర్ జాటోత్ రాహుల్ మరియు బిఆర్ఎస్ నాయకులు నైతం ఇశ్రు, కుమార్, నగేష్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.




