– బోరు మోటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
దౌల్తాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవ నేని రఘు నందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో కురుమ సంఘం భవనం వద్ద తన సొంత డబ్బులతో వేయించిన బోరు మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి చెందిన దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజాసేవలో ముందుంటానని తెలిపారు. అనంతరం ఎన్నికల సమయంలో యువకులకు ఇచ్చిన మాట ప్రకారం క్రికెట్, వాలీబాల్ కిట్లు, ఫ్లడ్ లైట్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామి, నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, రాజి రెడ్డి, సత్తయ్య, ఎల్లం, కనకరాజు, శివ, కురుమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…