సుమన్ నోరు అదుపులో పెట్టుకో.
మంచిర్యాలలో సుమన్ దిష్టిబొమ్మతో శవయాత్ర.
దిష్టిబొమ్మ దహనం.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మండి పడుతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన, విద్యార్ధి సంఘాల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాల్క సుమన్ తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు.
ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు సుమన్ దిష్టిబొమ్మను ఊరేగించారు. సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజితజె మాట్లాడుతూ బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచితవ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ప్రజా పాలన ను చూసి ఓర్వలేక అక్కసు వెల్లకక్కుతున్నారని మండి పడ్డారు. ఇతర జిల్లాకు చెందిన సుమన్ ఈప్రాంతంలో అలజడులు సృష్టించడానికి కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.
కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సుమన్ అహంకారం చెన్నూర్ లో ఆయన ఓటమికి కారణమైందని గ్రహించుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పోలీసులు సుమన్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
