జోగులాంబ గద్వాల్ నవంబర్ 10 :జర్నలిస్టుల సంక్షేమమే బి ఆర్ ఎస్ ప్రభుత్వ ద్యేయం.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటివారు జర్నలిస్టులు.
నడిగడ్డ జర్నలిస్టుల సేవా సమితి కార్యాలయ ప్రారంభోత్సవం లో మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలోని రాయచూరు రోడ్ దగ్గర నేడు నడిగడ్డ జర్నలిస్ట్ సేవా సమితి కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ జి చిన్న దేవన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు,ప్రభుత్వ పథకాలలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జర్నలిస్టుల కు ప్రత్యేకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఇండ్ల స్థలాలు,వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం కు ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు చేరవేస్తూ అలుపన్నదే లేకుండా జర్నలిస్టులు పాటుపడతారని, 4వ ఎస్టేట్ గా సమాజంలో మీడియా ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
అనంతరం జర్నలిస్టులంతా కలిసి మునిసిపల్ చైర్మన్ ని శాలువతో సత్కరించటం జరిగింది.
కార్యక్రమంలో నడిగడ్డ జర్నలిస్టుల సేవా సమితి ప్రతినిధులు మరియు దళిత జర్నలిస్టుల ఫోరం కషపోగు రాజు , మరియు మీడియా మిత్రులు , కేశవరం మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.