దౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్, ఐదవ వార్డ్ మెంబర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి నియోజవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తయ్యాయని, ప్రజలిచ్చిన మనోధైర్యంతోనే అసెంబ్లీలో దుబ్బాక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. అనంతరం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపాయంపల్లి, కొనాయిపల్లి సర్పంచులు లావణ్య నరసింహారెడ్డి, కొత్త సురేందర్ రెడ్డి నాయకులు మర్కంటి నరసింహులు, రాజు, సతీష్, మల్లేశం, తుమ్మల గణేష్, కురుమ గణేష్, నవీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…
