చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ విజయం సొంతం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం:డిసెంబర్ 03
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37,189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘన విజయాన్ని స్వాగతిస్తూ నియోజక వర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
