అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ఎమ్మేల్యే , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు, ముఖ్య నేతలు, కార్యకర్తలు
ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్
1) ప్రజల మద్దతుతో మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం.
2) కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించాను.
3) మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని వనరులను వినియోగించుకొని అభివృద్ధి బాటలో నిలిపాం.
4) హాజీపూర్ రైతుల చిరకాల కోరిక అయినా 8వేల ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం.
5) ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్న బిజెపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.
6) బిజెపి పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కొనసాగుతుంది.
7) బిజెపి పాలిత రాష్ట్రాలకు వేలకోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు, తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపారు.
8) రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తున్నాం.
9) బిజెపి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తారు.
10) మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేత ప్రేమ్ సాగర్ రావు స్థానిక బ్యాంకులకు 800 కోట్ల రూపాయలు అప్పుగా ఉండి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు.






