ముస్తాబాద్, నవంబర్14 (24/7 న్యూస్ ప్రతినిధి)
ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి (లక్ష) రూపాయల సేకరించి చెక్కురూపంలో పరశురాములు కుటుంబ సభ్యులైన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈలోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్తమిత్రుడు ఇక లేడనడం చాలా బాధాకరమని భౌతికంగా మామధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మామధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు పరశురాములు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, అగ్రారపు కనకయ్య, రాజగౌడ్, నీరెటి కిష్టయ్య, కొండం తిరుపతి, ఏళ్ళ దేవరాజులు ఉన్నారు.
