*పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి, గడ్డం వంశీకృష్ణ , ఎన్నికల ప్రచారంలో భాగంగా గేట్ మీట్టింగ్ లో శ్రీరాంపూర్ సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడారు.*
సింగరేణి అంటే మొదట అందరికీ గుర్తుకొచ్చేది, కాక గడ్డం వెంకటస్వామి అని చెప్పారు, ఎందుకంటే ఒక కార్మిక నాయకుడిగా, సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్లు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చారని, లక్ష పైగా కార్మికుల ఉద్యోగాలు కాపాడి, కార్మికుల కుటుంబాలకు అండగా ఉన్నారు, ఉద్యోగ విరమణ తర్వాత, కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే, దానిని గమనించిన కాకా , ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్లు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టారు, గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదని, అసలు రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాక గారేనని అందరికీ ఒకసారి గుర్తు చేశారు, ప్రత్యేక తెలంగాణ సమయంలో, కార్మికులు ఎంత కృషి చేశారని అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు.
తెలంగాణ తొలి ఉద్యమంలో, కాక బుల్లెట్ గాయాలు సైతం లెక్కచేయకుండా పోరాడారని ఈ సందర్భంగా చెప్పారు, పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి, గడ్డం వంశీకృష్ణ , ఇన్ని పోరాటాలు ఇన్ని త్యాగాలతో వచ్చిన తెలంగాణ, దొంగల పాల అయిందని, అప్పుల పాలు అయిందని, నిరుద్యోగ తెలంగాణ గా ఉందని, దీని అంతటికీ కారణం BRS పార్టీ KCR అని చెప్పారు, 10 సంవత్సరాల పదవిలో ఉన్న BRS నాయకులు, KCR సింగరేణి కార్మికుల కోసం చేసింది ఏమీ లేదు అని చెప్పారు, ఐటీ స్లాబ్ విషయంలో కానీ, కార్మికుల సొంత ఇంటి గురించి గానీ, నేషనల్లైజేషన్ లో కష్టాల్లో ఉన్న ఎన్నో సంస్థలని కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీది, సొంత సంస్థలోనే కాకా గారు , యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేసి చేసారు, యూనియన్ పెట్టించింది కూడా కాకా , కానీ BRS ప్రభుత్వం కక్ష కట్టి, ఆ సంస్థను మూసేలా చేసింది, అయినప్పటికీ కార్మికులందరికీ రిటైర్మెంట్ వరకు వచ్చే జీతాల్ని ఇచ్చి, VRS ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేయడం జరిగింది.
ఎటువంటి సమస్యలు వచ్చిన కార్మికులకు అండదండగా ఉంటామని చెప్పారు, ఐటి స్లాబ్స్ విషయంలో కార్మికులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు, సింగరేణి కార్మికుల కోటర్స్ ని BRS నాయకులకు ఇచ్చుకున్నారని, ఇవన్నీ గర్వంతో చేసే పనులను, తప్పకుండా ప్రజలు వీటన్నిటిని గమనించాలని చెప్పారు, సింగరేణి కష్టాల్లో ఉందంటే, అది సిగ్గుచేటునే, సింగరేణి అమ్ముకున్న ఘనత అది KCR ది BRS పార్టీ ది అని చెప్పారు, 25 వేల కోట్లు బకాయిలు సింగరేణి సంస్థకు రావాల్సి ఉండగా, ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని చెప్పారు, పది సంవత్సరాల పూర్తి అధికారంలో ఉన్నప్పుడు , సింగరేణికి ఎటువంటి ఉపయోగపడే పని చేయలేదు కానీ, ఇప్పుడు మళ్లీ వచ్చే అది చేస్తాం అది చేస్తామని , మాటలు చెబుతున్నారని చెప్పారు, పెట్టిన పథకాలు అన్ని, బిఆర్ఎస్ నాయకులకు, వాళ్ళ అనుచరులకు మాత్రమే వచ్చేలా చేసుకున్నారని చెప్పారు, BJP పార్టీ మోడీ కేంద్రంలో ప్రభుత్వ సంస్థలన్నీటిని ప్రైవేటీకరణ చేసి దేశాన్ని, అదాని అంబానీలకు, తాకట్టు పెడుతున్నారని చెప్పారు, ప్రజలకు సేవ చేసే నాయకులను ప్రజలు గుర్తించాలని చెప్పారు, బిజెపి యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చింది , కానీ మోడీనే పార్లమెంట్లో ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అఫీషియల్ గా చెప్పారని చెప్పారు, అదాని అంబానీలకు, 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని చెప్పారు, కార్మికులకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పారు.
కార్మికులందరూ ఆశీర్వాదాలతో, కార్మికుల అండతో, పార్లమెంట్లో సింగరేణి కోసం , కార్మికుల కోసం, పోరాడుతానని చెప్పారు, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా సింగరేణి కార్మికులను కోరారు, పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి, గడ్డం వంశీకృష్ణ .
