యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం మరియు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 21వ వర్థంతిని నిర్వహించారు. ఆయన ఫోటోకు పూలాలంకరణ చేసి నివాళులు తెలిపారు.
జాతీయ సేవాపథకం ప్రోగ్రామ్ అధికారి ,రచయిత వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ప్రజాసమస్యలే ఇతివృత్తంగా కవిత్వం రచించారనీ, తెలంగాణకోసం నిరంతరం తపించారనీ గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. కాళోజీ నాగొడవ, జీవనగీతిక , అణాకథలు, నా భారతదేశయాత్ర, బాపు! బాపు! బాపు! మొదలగు గ్రంథాలు రచించారన్నారు. శాసనమండలి సభ్యులుగా , తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా, రాష్ట్రసాహిత్య అకాడమీ సభ్యులుగా సేవలందించారన్నారు. పద్మవిభూషణ్ పురస్కారంతోపాటు గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డు, రామినేని అవార్డు.
గురజాడ అవార్డు లభించాయనీ, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించిందన్నారు. కాళోజీగారు “అన్యాయం ఎదిరిస్తే నాగొడవకు సంతృప్తి- అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడనీ తెలిపారనీ, అలాగే జయప్రకాష్ నారాయణ గురించి “పుటుకనీది చావు నీది బతుకంతా దేశానిది” అని రాసినా అది కాళోజికీ కూడా వర్తించిందన్నారు. నిరంతరం తెలంగాణకోసం పరితపించారనీ గొప్ప వ్యక్తి అని విద్యార్థులు, యువత కాళోజీని స్ఫూర్తిగా తీసుకోవాలని పరశురాం అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, నీరటి విష్ణు ప్రసాద్, ఆర్ గీత, చిలుక ప్రవళిక, కొడిముంజ సాగర్, అగోలం గౌతమి బోధనేతర సిబ్బంది కె.దేవేందర్, ఎం.డి తాజోద్దిన్ మరియు లక్ష్మీ, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు ,విద్యార్థులు పాల్గొన్నారు.
