శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు….
– ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్
ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు,
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా ఇండ్లు వర్షం కారణంగా కూలిపోతే గ్రామాలలో గల వి ఆర్ ఎ (సుంకరు) ల దృష్టికి తీసుకెళ్లి సమాచారం ఇవ్వాలని లేదా నేరుగా తన దృష్టికి అయినా తీసుకురావాలని ఆయన వెల్లడించారు.
