బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం
-మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య
, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు బాబు, వంగ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, షేక్ గౌస్, పందిర్ల లింగం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రోడ్డ రామచంద్రం, బుచ్చినంగి సంతోష్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గుర్రపు రాములు, గంట అంజా గౌడ్, బుచ్చా గౌడ్, ద్యాగం నారాయణ ఉన్నారు.
