తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను సిరిసిల్ల శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.




