ప్రాంతీయం

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దుచేయాలి…

22 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి12 (24/7న్యూస్ ప్రతినిధి)
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను ఉపాధిహామీ పథకంతో కుదింపు, విద్యుత్ బిల్లు 2025 సవరణ రద్దుచేయాలని మండలంలో నినాదాలతో కార్మిక నాయకులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మీసా లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కుర్రరాకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలపై కార్మికుల పొట్టకొట్టే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. 2025 విద్యుత్తు సవరణ చట్టం బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి

హామీ పేరును మార్చి దానికి రావాల్సినటువంటి బడ్జెట్ ను తగ్గించి ఉపాధి హామీలోకోత తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని దీని వ్యతిరేకంగా వామపక్షా సంఘాల ఆధ్వర్యంలో అనేకమంది కార్మికులతోని ధర్నార్యాలీ చేసామన్నారు. ఇదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మిద్దెమీన్స్, జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు గీస బిక్షపతి, అమాలి కార్మికులు, భవన కార్మికులు, ఆశవర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *