అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (జగదీష్సొం కర్ ) ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు.
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందరి అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని సిరిసిల్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ తేల్చారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 20 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని వేములవాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధు సూదన్ తేల్చారు. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ లు తిరస్కరించారు.



