– బీఆర్ఎస్ పార్టీ మాటలు తప్ప చేతల్లేవు
– దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘు నందన్ రావు
దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు..సోమవారం మండల పరిధిలోని కొనయిపల్లి, గోవిందా పూర్, గువ్వలేగి, ఉప్పర్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.కెసిఆర్ కు మద్యం పైన ఉన్న ధ్యాస యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గత తొమ్మిది ఏళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలియజేయాలన్నారు. గ్రామాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతోనే గ్రామాల్లో నూతన ఒరవడి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడం సరికాదన్నారు.తాను గెలిచిన మూడేళ్లలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసి మళ్లీ మీ ముందుకు రావడం జరిగిందని తనను ఆశీర్వదించి గెలిపించినట్లయితే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ దుబ్బాక నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వని కేసీఆర్ సన్న బియ్యం ఇస్తానంటూ మాయా మాటలు చెబుతున్నాడని మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ఎవరికి ఇవ్వలేదు కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపారని, దళితుల చిరకాల వాంఛనను నెరవేర్చబోతు నారని పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే ఆసరా పింఛన్లు సరిగ్గా ఇవ్వడం చేతకాదు కాని మళ్లీ అధికారంలోకి వస్తే రూ.5 వేలు పెంచుతామని తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయా గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు బిజెపిలోకి చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్త సురేందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ తో పాటు ఆయా గ్రామాల శక్తి కేంద్ర ఇన్చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు….