పాలకుర్తి సెప్టెంబర్ 30:ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక.
గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి.
పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, కొలుకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎండీ ఖాసిం, శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటయ్య ల ఆధ్వర్యంలో మాచర్ల హరిబాబు, శివ, హరి, ప్రభుదాస్, ప్రవీణ్, కుమార్, యాకస్వామి, మధు, వెంకన్న, కొమురయ్య, అరుణ్, సోమయ్య తదితరులు, తొర్రూరు మండలం, సోమవరపుకుంట తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ధారావత్ వెంకన్న, కొట్టమ్మ, సమ్మన్న, బానోత్ వెంకన్న, ధరవత్ శ్యామ్ నాయక్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరగా, వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.




