– ప్రచారంలో దూసుకుపోతున్న కవ్వంపల్లి.
-పోలం మల్లేష్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు…
(తిమ్మాపూర్ నవంబర్ 13)
మానకొండూరు నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చి చూసామని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి, మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిత్ర డెవలపర్స్ పొలం మల్లేషం ఆధ్వర్యంలో 150 మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టి లో చేరారు.
ఈ సందర్భంగా వారికి కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు సుభాష్ నగర్ నుండి రామకృష్ణ కాలనీ వరకు భారి ర్యాలీగా మహిళలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రామకృష్ణ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో కవ్వంపల్లి మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసే భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కవ్వంపల్లి కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొరపల్లి రమణారెడ్డి, గోగురి నరసింహారెడ్డి, శ్రీగిరి రంగారావు, గంకిడి లక్ష్మారెడ్డి, ధన్నమనేని సురేందర్ రావు, ఇనుకొండ వీర చంద్రారెడ్డి, పొలం మల్లేష్ యాదవ్, మాచర్ల అంజయ్య, గవ్వ రవిందర్ రెడ్డి, గవ్వ రాజేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.