సిద్దిపేట జిల్లా నవంబర్ 17
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ మండలంలో ఈరోజు ప్రచారంలో భాగంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు & ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారు మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి పనుల్లో ముందజుల్లో ఉందంటే దానికి గల కారణం మన కేసీఆర్ చేసిన కృషి అని,అభివృధికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరియు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు తెలియజేశారు.మర్కుక్ మండల గ్రామంలోని ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్,జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్,వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ బాలరాజు,బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య,నాచారం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ హరి పంతులు, వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామదాసు గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్,మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్,చేబర్తి సర్పంచ్ ఎర్రబాగు అశోక్, రాజు రెడ్డి, అంగడికిష్టాపూర్ సర్పంచ్ దుద్దెడ లక్ష్మి రాములు గౌడ్, బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





