రాజకీయం

గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమాలు…

239 Views

వర్గల్ మండల్ నవంబర్ 11:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలోని వర్గల్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినమండల ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు కలసి ఇంటింటా ప్రచారంలో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి కెసిఆర్ కారు గుర్తుకు ఓటు వేయాలి అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *