సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు దూస శ్రీనివాస్, గోశిక దాసు తదితరులు ఉన్నారు.
