Breaking News

*23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని పట్టుకున్న వేములవాడ రూరల్ పోలీసులు

100 Views

23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని పట్టుకున్న వేములవాడ రూరల్ పోలీసులు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని వేములవాడ రూరల్ పోలీసులు పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి పర్యవేక్షణలో సి.ఐ కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో ఏ.ఎస్.ఐ లాక్పతి,సిబ్బంది సంపత్, శ్రీనివాస్,ఎల్లగౌడ్, అంజయ్య లతో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లెకు చెందిన సంద్రగిరి లింగయ్య, తండ్రి రాజయ్య,60 సంవత్సరాలు అనే వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ 2000 సంవత్సరం లో పెరోల్ మీద జైలు నుండి వచ్చి 23 సంవత్సరం లుగా తప్పించుకొని తిరుగుతున్న సంద్రగిరి లింగయ్య ను ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ రోజు ఉదయం ఎల్లారెడ్డిపేట్ మండలంలో పట్టుకొని వరంగల్ జైలు కి తరలించడం జరిగిందని ఎస్పీ గారు వెల్లడించారు..

వేములవాడ రూరల్ సి.ఐ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *