ప్రాంతీయం

ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.

74 Views

 

  • ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.

యువకులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ప్రోడక్ట్ అధికారి ధర్మేందర్ సింగ్ ఉమ్మడి దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ రామాంజనేయ ఏజెన్సీ ఆధ్వర్యంలో హవెల్స్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ఉమ్మడి దౌల్తాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు హావెల్స్ కంపెనీ ప్రోడక్ట్ హెడ్ అధికారి ధర్మేందర్ సింగ్ ఏరియా హెడ్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మండల కేంద్రంలో వ్యాపార వాయిద్య సంస్థలు ఏర్పాటు చేస్తే మండల అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు బ్రాండెడ్ కంపెనీ పరికరాలు మండల కేంద్రంలో అందుబాటులో ఉంచడం ఎంతో హర్షించదగా విషయమన్నారు యువకులు ఉపాధి మార్గాలను ఎంచుకొని ఇతరులకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఉందన్నారు కొత్త మండలంలో కొత్త కొత్త వ్యాపార వాణిజ్య సమస్యలు ఏర్పాటు తేనె మండలానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు ప్రైవేట్ ప్రభుత్వ అందిస్తున్న పథకాలను గ్రామాల్లో యువకులు సద్వినియం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మండలం కూడా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు మండల కేంద్రంలో హవాలిస్ కంపెనీ ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామం అన్నారు, కార్యక్రమంలో ప్రోడక్ట్ హెడ్ అధికారి ధర్మేందర్ సింగ్, ఏరియా హెడ్ ఆఫీసర్ సత్యనారాయణ ,సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ ,ఉమేష్ చంద్ర, డిస్ట్రిబ్యూటర్ హనుమంతు రాజు స్రవంతి, దుడుక నగేష్ కుమార్, పంగ మహేష్, కొంగరి శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు ఇప్ప ప్రభాకర్, గడ్డమీది అశోక్, ఉమ్మడి దౌల్తాబాద్ మండలం సోషల్ మీడియా నాయకులు తిరుపతి కిషన్ , నరసింహులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *