
ఈ రోజు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామ పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, VRA, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు




