*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థికి ట్రై సైకిల్ అందజేత*
డ్రాప్ అవుట్ గా మారిన పాఠశాలకు దూరమైతున్న సయ్యద్ సలాం విద్యార్థి ఆరవ తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థికి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లేకపోవడం చేత పక్క గ్రామమైన రామవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరవ తరగతి చదవడానికి వెళ్లాలి. సయ్యద్ సలాం కు చదవంటే చాలా ఇష్టం ఎంత కష్టమైనా సరే పక్క గ్రామానికి వెళ్లే చదువుకోవాలని ఆసక్తి ఉందని సీఆర్పీలు యాదగిరి, స్వామి లయన్స్ క్లబ్ వారికి సమాచారం అందించగా వెంబడి స్పందించి లయన్స్ క్లబ్ అమర్నాథ్, డీ. గవర్నర్, రమణ రావు టీచర్, మైధిలి క్లబ్ సెక్రటరీ జెడ్ పి హెచ్ ఎస్ మార్కుర్, గంధం కిషన్, ప్రెసిడెంట్ స్నేహ క్లబ్ హైదరాబాద్ మృత్యుంజయ రావు, సెక్రెటరీ స్నేహ క్లబ్ హైదరాబాద్ వారి సహకారంతో విద్యార్థికి ట్రైసైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థికి చదువుపై ఆసక్తి ఉన్నందున ట్రైసైకిని అందజేయడం జరిగింది అన్నారు. విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చేసుకున్నందుకు సిఆర్పి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు నరేష్, శ్రీరాములు, వేణుగోపాల్, విజయలక్ష్మి, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు.