ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..
ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థుల చదువుల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నత విద్య చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించడం జరిగింది అన్నారు. షాది ముబారక్ ద్వారా ఆడ కుతూర్ల వివాహాలకు సాయం చేయడం జరిగింది.. మస్జిద్ ల నిర్మాణలకు, షాది ఖానలు, మైనారిటీ బంధువు, కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ పండుగకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. మస్జిద్ లోని గురువులైన ఇమామ్, మౌజన్ లకు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దేశంలో ఎక్కడ లేని పథకాలను మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. మైనారిటీ రాష్ట్ర నాయకులు ముజీబ్ కర పత్రాల ద్వారా ఉర్దూలో, తెలుగు లో క్లుప్తంగ ప్రచురించి మైనారిటీ లకు బి ఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ముస్లిం జీవితాలు వెలుగులను వివరించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని మర్వకుండ ప్రతి ఒక్క ఓటు కారు గుర్తుకు వేసి మంత్రి కేటీఆర్ ను గెలిపించుకుని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చే బాధ్యతను స్వీకరిస్తూ విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ముజీబ్ బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న ముజీబ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీద్, బాబా ధకని, పున్ను, రఫిక్, మండల కేంద్రంలో షాదుల్లా, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.




