Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

117 Views

అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

సిరిసిల్ల 10, నవంబర్ 2023
అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:
జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు.
వాటిని సీజ్ చేయడంతో పాటు బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అలాగే ఎన్నికల సందర్భంగా ఎవరైనా అనధికారిక మద్యం దుకణాలు ఏర్పాటు చేసిన, మద్యాన్ని ఎన్నికల కొరకు రహస్యంగా నిల్వ ఉంచిన మొబైల్ నెంబర్ లు 8712658829, 8712658830, 8712658831, 8712658828 లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ యాప్‌ ఉంటే చాలు….
*సులభంగా మద్యం*
*అసలేదో.. నకిలేదో ఇట్టే తెలుసుకోవచ్చు* *:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ*
ఈ మధ్య లిక్కర్‌లోనూ నకిలీ హల్‌చల్‌ చేస్తోన్న ఘటనలు వింటున్నాం.పెద్ద బ్రాండ్‌లనే టార్గెట్‌ చేసి కేటు గాళ్లు నకిలీ తయారు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ లిక్కర్‌లో అసలు ఏది? కల్తీ ఏది? అనేది గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారిందట.. గతంలో నకిలీ మద్యం సేవించి ఎన్నికల తర్వాత అనారోగ్యం పాలై.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘వేరిట్’ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎక్సైజ్‌ శాఖ.
ఇక, ‘వేరిట్’ యాప్‌పై అంతే కాదు.. ఇక ఎన్నికల సమయంలో విచ్చిలవిడిగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు లిక్కర్‌ పంపిణీ చేస్తూ వస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.. ప్లే స్టోర్ నుంచి ‘వేరిట్‌’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు..

ఈ యాప్‌ ద్వారా మద్యం బాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదా? కాదా? అనే విషయం తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, యాప్‌ ను ఎలా ఉపయోగించాలో కూడా ఆయన వివరించారు.. ‘వేరిట్‌’యాప్‌ను ( verit app )
డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన లిక్కరో ఇట్టే తెలిసిపోతుందన్నారు.. అంతే కాదు.. అది ఒరిజినలా? లేక నకిలీనా? అనే విషయం కూడా వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇక, ఎన్నికల సమయంలో.. జోరుగా మద్యం పంపిణీ, అక్రమ మద్యం నిల్వలపై సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా మధ్య నిషేధ ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ వెల్లడించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *