ధర్మపురి నవంబర్ 9
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. అంతకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధితో పాటు.రామగుండంలోని విజయ దుర్గ దేవి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నామినేషన్ పత్రాలు(బి ఫామ్)స్వామి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమాంత్రోత్సవాలతో కొప్పుల ఈశ్వర్ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రార్ధించారు.
