ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన
-బిజేపీ యువ నాయకులు సీత శ్రీకాంత్ యాదవ్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 12, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు,సబ్సిడీ సిలిండర్ల పంపిణీ చిట్టి సునీత,ఎండీ సమీనా,చెప్యాల మహాంతి,సీత రేణుక,చిట్టేల మానస,అర్హులైన మహిళలకి గుగ్గిళ్ల గ్రామ బిజెపి యువ నాయకులు సీత శ్రీకాంత్ యాదవ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన మహిళలు పేదవారై ఉండాలని,ఇంట్లో ఇప్పటికే ఎల్‌పీజీ కనెక్షన్ ఉండని వారు ఈ యొక్క ఉజ్వల యోజన పథకానికి అర్హులని,ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ან బీపీల్ సర్టిఫికేట్), బ్యాంక్ ఖాతా పుస్తకం, కె వై సి ఫారమ్.ఆన్‌లైన్:https://www.pmuy.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అనంతరం మహిళలు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ లభించడం పట్ల సంతోషంగా ఉన్నామని తెలిపారు.





