ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9 (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ నుండి కేకే అభిమానులు సిరిసిల్లకు బైక్ లపై వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు కేకే నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమంలో నాగుల సత్యనారాయణ గౌడ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
