ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9, (టిఎస్ 24/7న్యూస్) బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్‌లో పూజలు చేసి తండ్రి సిఎం కెసిఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు మరొక్క రోజే (శుక్రవారం) మిగిలి ఉండడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్యతో పాటు పలువురు నేతలు ఉన్నారు.
