దుబ్బాక తహసిల్దార్ మండలం మున్సిపల్ కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిశీలన
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31,( తెలుగు న్యూస్ 24/7)
సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసిల్దార్ కార్యాలయం దుబ్బాక మండలం సంబంధించి దుబ్బాక మున్సిపల్ కార్యాలయం లో మున్సిపాలిటీ పరిధిలోని ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఎలెక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలి. ఆయా వార్డుల వారిగా బిల్ కలెక్టర్ లు, సూపర్ వైజర్ లు, బిఎల్ఓ లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రెండు ప్రాంతాల్లో ఓటు ఉన్న వారిపైన దృష్టి సారించి ఒక్క ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించేలా వెరిఫై చెయ్యాలని ఆదేశించారు. ప్రతి రోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.





