ప్రాంతీయం

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభం

27 Views

 

ఎండి ఇస్తియాక్ ఎండీ ఇంతియాజ్,ఆధ్వర్యంలో

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభించిన

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా,ఆగస్ట్ 15

జర్నలిస్ట్, సోదరులు భువనగిరి,బ్రదర్స్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ జన్మదినాన్ని,పురస్క రించుకొని,ప్రభుత్వం, ఆధ్వర్యంలో 15వ ఆగస్ట్ స్వతంత్ర,దినోత్సవాల సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లొ నిర్వహించే వేడుకల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్,మరియు మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ ఎండీ ఇస్తియాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి లొ చికిత్స పొందే గర్భిణీ,స్త్రీలకు మరియు,వికలాంగులకు, బాలలకు,భువనగిరి పట్టణ వ్యాప్తంగా ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, భువనగిరి,నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం,అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది.ఈ సందర్బంగా శాసన మండలి చైర్మన్ భువనగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ,జర్నలిస్ట్ సోదరులు సోషల్ యాక్టివిస్ట్ హ్యూమన్ రైట్స్ అధ్యక్ష కార్యదర్శి లు ఎండీ ఇంతియాజ్ అహ్మద్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్ లు కరోనా కష్ట కాలం లొ కుల మతాలకు అతీతంగా ఉచితంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా నిరుపేదలకు,ఆక్సీజన్ సిలిండర్ లు,అందజేయడం నిత్యవసర సరుకులు అందించడం,విద్యార్థులకు ఫీజులు చెల్లించడం ప్రతి సంవత్సరం రంజాన్ లొ రేషన్ కిట్స్ ఇవ్వడం తొ పాటు నగదు డబ్బులను అందజేయడం జరిగిందని అన్నారు.అదే విధంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు,నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీస్ ను ప్రారంభం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. మరియు జర్నలిస్ట్ లుగా ఉంటూ,ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు,ప్రజలను తమ వార్త సమాచారం తొ జాగృతం చేస్తూ.మంచి పేరు సంపాదించుకున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ,ఇక ముందు కూడ వారి సేవ కార్యక్రమాలు కొనసాగాలని మనసారా ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.అలాగే ప్రభుత్వ పరంగా మా పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లొ విశిష్ట అతిదులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు,అడిషనల్ కలెక్టర్ వీర రెడ్డి,ఆర్డీఓ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ లుగా సోదరులు మంచి గుర్తింపు తెచ్చుకొని,సేవ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని అభినందించారు.ఈకార్యక్రమం లొ గ్రంధాలయం చైర్మన్ అవేస్ చిస్తీ,డీసీపీ ఆకాంక్ష్ యాదవ్,ఏసీపీ రాహుల్ రెడ్డి తహసీల్దార్ అంజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేష్వర్లు,డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ మజహర్ పీసీసీ మెంబర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ 27వ వార్డు, మాజీ కౌన్సిలర్లు నాజిమా సలవొద్దీన్,లయీక్ అహ్మద్ టీమ్ మెంబర్స్ ఇమ్రాన్ ఖాన్ ఎండీ ఇర్ఫాన్,షకీల్ తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *