నిర్మల్ నవంబర్ 8 :ప్రచారంలో హోరెత్తిన ప్రజానికము.సారు కారు సర్కారు.ప్రజల ఆశీర్వాదంతో ప్రచారంలో ముందుకు దుసుకెళుతున్న ఎమ్మెల్యే. ప్రచారం లో గులాబీ జోరు.
కుబీర్ మండలంలోని హంపోలి గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి.
కెసిఆర్ అమలు పరిచే సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించాము అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి తో మన పల్లెల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నామని పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్ రైతు వేదికలు ఎన్నో నిర్మించి మన గ్రామాల యొక్క రూపురేఖలు మార్చుకున్నామని ఎమ్మెల్యే తెలియజేశాడు.