24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజు సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి లు కలసి బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,ల చేతుల మీదుగా అందజేశారు. అలాగే మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్ 1000 రూపాయలు,మాజీ ఉప సర్పంచ్ 1000 రూపాయలు అందజేశారు. వారితో పాటు చేబర్తి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్యార మల్లేశం,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి,గ్రామ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య,నాయకులు జయరాం,చాట్ల పల్లి బాల్ నర్సయ్య,చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
