రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమి ని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి కబ్జా చేసి అమ్ముకున్నందున మండల కాంగ్రెస్ పార్టీ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీలో ప్రతి ఒక నాయకుడు అక్రమాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని
రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమిని కబ్జా చేసి పైసా కకృతికి ఆశపడి రియల్ ఎస్టేట్ దళారులకు అమ్మారని దీని పూర్తిగా ఖండిస్తూ శనివారం రోజు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేసి ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించడం జరిగిందని అన్నారు.




