రాజకీయం

ఎంపీ స్వగ్రామం పోతారం నుండి బిఆర్ఎస్ కి బిగ్ షాక్

286 Views

– కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 మంది గ్రామస్తులు

దౌల్తాబాద్: బిఆర్ఎస్, బిజెపి చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని దుబ్బాక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పోతారం గ్రామనికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలతో, అమలు చేయని హామీలతో ప్రజలు విసిగిపోయారని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్, బిజెపిలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తుందన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి దుబ్బాకలో ముత్యం రెడ్డి పాలన రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన తెచ్చుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగారి రవి మండల ఉపాధ్యక్షుడు K .నరేందర్ రెడ్డి, బాల్రెడ్డి అనంతుల రాజు సంజీవులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *