దౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో సోమవారం బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ పంచమి స్వామి, బిజెపి నాయకులు కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల లాగా అభివృద్ధి కావాలంటే దుబ్బాక ఎమ్మెల్యే గా రఘునందన్ రావును గెలిపించాలన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో పడిందన్నారు. ప్రశ్నించే వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే రఘునందన్ రావు అని అన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, వెంకట్, రాజు, కుమార్, శ్రీకాంత్, అంజయ్య, మహేష్, చంద్రం, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు
