దౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ సెక్రటరీ మల్లేశం అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, స్వామి గౌడ్, శ్రీనివాస్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు….




