ప్రాంతీయం

యువత రాజకీయాల్లోకి రావాలని తీన్మార్ మల్లన్న పిలుపు

17 Views

యువత రాజకీయాల్లోకి రావాలని తీన్మార్ మల్లన్న పిలుపు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న
తాండూరు మండల యువత.          యువతతోనే సేవాభావంతో కూడిన నిజమైన ప్రజా రాజకీయాలు నిర్వహించబడతాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ.

మంచిర్యాల జిల్లా.

బెల్లంపల్లి నియోజకవర్గం, తాండూరు మండలం యువకులు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. మండల నాయకులు వాసాల అనిల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తికి ఆకర్షితులై, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మాభిమానంకొరకై ఏర్పడిన పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఈరోజు పెద్దఎత్తున యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరారని మహేష్ వర్మ అన్నారు. మహేష్ వర్మ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని ఆశించిన మొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు. యువతరంతోనే నూతన రాజకీయాలకు, ప్రజా రాజకీయాలు, న్యాయమైన, చట్టబద్ధమైన రాజకీయాలు సేవా భావంతో నిర్వహించబడతాయని అన్నారు. మేధావులు, విద్యావంతులు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ఉంటేనే మన రాజ్యాధికారం మనకు దక్కుతుందని, ఎవరెంతో వారికంత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వచ్చేది బీసీల రాజ్యమే అని, పరాయి పార్టీ జెండాలను పక్కనబెట్టి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ప్రజల పక్షాన కొట్లాడే, పోరాడే నాయకులకు, యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వాగతం పలుకుతుంది స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, ఇప్ప కిషోర్, మండల నాయకులు చంద్రశేఖర్, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *