హైదరాబాద్ నవంబర్ 4:దేశంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా.. కేటీఆర్
కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు..దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకూడదని కోరుకుంటా అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. అంత మాత్రాన మొత్తం ఓట్లు ఆ పార్టీకి మళ్లవు అన్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉందని ఇవాళ కొంత పుంజుకున్నట్లు కనిపించినా.. 51 శాతం ఓటింగ్ మాత్రం పొందే ఛాన్స్ లేదన్నారు. కాంగ్రెస్ స్టేట్‌లో అధికారంలోకి వస్తుందని కలలోనైనా ఊహించనని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను ఢీ కొట్టే, సరిసమానమైన లీడర్ కాంగ్రెస్, బీజేపీలో లేరన్నారు. అయితే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకూడదని చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు తెలుపుతున్నారా అనే కొత్త చర్చ మొదలైంది.




