రాజకీయం

వివేకానంద కూడలిలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు…

119 Views
ముస్తాబాద్/అక్టోబర్/14;  భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని స్థానిక నేతలు సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు మరి 30 పడకల ఆసుపత్రి ఎటు పోయినది గతంలో కొందరు నాయకులు పేపర్ లో ఫోటోలు ఏపిచ్చుకొన్నారు ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రి మంజూరు కాలేదు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసాము అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు 30 పడకల ఆసుపత్రి మంజూరు అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను తెలియజేస్తూనే ఉంటాం ఆస్పత్రి కొరకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కి కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వెయ్యబోదు ఇకనైనా స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ కి ఒత్తిడి తెచ్చి ముస్తాబాద్ మండలం 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోలకృష్ణగౌడ్, పట్టణ అధ్యక్షులు మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షులు జనార్ధన్, దళిత మోర్చా మండల అధ్యక్షులు కేసుగాని తిరుపతి, మండల ఉపాధ్యక్షులు కాసోడి రమేష్, శ్రీనివాసరావు, మీసా శంకర్, హరిబాబు, బాధా నరేష్, కిట్టు, పెంజర్ల కళ్యాణ్ , బోయిని వేణు, పోచంపల్లి బాలాజీ మెరుగు అజయ్ మద్దికుంట రమేష్ లక్కడి హర్షవర్ధన్ గూడ మహేందర్,  కుడుకల మహేష్ రాజం, బాబు, చందు, మారుతి, సాయి, సృజన్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7